Extra Marital Affair : తల్లితో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే… కోపంతో ప్రియుడితో కలిసి అతడి మర్మాంగాన్ని బ్లేడుతో కేసేసింది ఓ అమ్మాయి. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. అయితే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందన ఎస్. రామ చంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. ఇతడికి ఐతానగర్ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తాడు.
అయితే నిన్నరాత్రి సదరు మహిళతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం ఆమెతో కలిసి ఆమె ఇంటిపైనే పడుకున్నాడు. విషయం గుర్తించిన ఆమె కుమార్తె… తన ప్రియుడిని రమ్మని పిలిచింది. అతడు ఇంటికి రాగానే రామ చంద్రారెడ్డితో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి పట్టరాని కోపంతో ప్రియుడి సాయాన్ని కోరి అతడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. నొప్పి భరించలేక అతడు కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. తెనాలి టూ టౌన్ సీఐ కోటేశ్వర రావు ఆస్పత్రికి వచ్చి… బాధితుడి నుంచి వవివరాలు సేకిరంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Actress Pragathi : ప్రగతి ఆంటీ అంటే మాములుగా ఉండదు.. ఊపేస్తే ఊగి పోవాల్సిందే.. వీడియో వైరల్..!