Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే అంతం లేనిది, వినాశనం లేనిది అని అర్థం. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు మనం ఎలాంటి పనులు చేపట్టినా వాటికి అంత ఉండదని భావించి పెద్ద ఎత్తున నేడు శుభ కార్యాలు చేయడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. అలాగే అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల సంపద అభివృద్ధి చెందుతుందని భావిస్తారు. అయితే నిజంగానే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలా? ఈ విషయంలో పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం పురాణాలలో ఎక్కడా కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలని లేదు. ఇదంతా కేవలం వ్యాపారాన్ని విస్తరించడం కోసమే మనం సృష్టించుకున్నదని,అంతేతప్ప పురాణాలలో ఎక్కడా కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలని తెలియచేయలేదు అంటూ పండితులు చెబుతున్నారు. ఇకపోతే శ్రీమన్నారాయణుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని చేపట్టిన రోజుగా చెబుతారు. అందుకే నేడు శ్రీ లక్ష్మీ నారాయణుడిని పూజించడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.
అదేవిధంగా అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవి, గణపతి పూజ చేయటం మంచిది. ఈరోజు చేపట్టే పనులకు ఎలాంటి శుభముహూర్తాలు చూడాల్సిన పనిలేదు. ఈరోజు చేపట్టే ఎలాంటి పని అయినా విజయవంతంగా పూర్తి అవుతుంది.అందుకే అక్షయ తృతీయ రోజు శ్రీమన్నారాయణుడిని లక్ష్మీ గణపతి పూజ చేసి మన స్తోమత కొద్ది జలదానం, అన్నదానం, వస్త్ర దానం చేస్తే ఎంతో శుభప్రదమైన పుణ్య ఫలం కలుగుతుంది.అంతే కానీ ఈరోజు బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల మంచి కలుగుతుంది అన్నది కేవలం అపోహ మాత్రమే ఇది వ్యాపారాన్ని విస్తరింప చేయడం కోసం వ్యాపారంలో అభివృద్ధి సాధించడం కోసం మాత్రమే సృష్టించారు బంగారం కొనుగోలు చేయాలని పురాణాలలో ఎక్కడ తెలియజేయలేదు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World