Government jobs: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఉన్న పోస్టల్ డిపార్ట్ మెంటులో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికషన్ జారీ చేసింది. అయితే దేశంలో మొత్తం 38 వేల 926 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 1226 పోస్టులు, ఆంధ్ర ప్రదేశ్ లో 1716 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిన్నిటికి నోటిఫఇకేషన్ విడుదల చేశారు. వీటికి అర్హత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అలాజే జీత భత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టైం రిలేటెడ్ కంటిన్యుటీ అలవెన్స్(టీఆర్ సీఏ) ప్రకారం జీత భత్యాలు చెల్లించాలి. బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు 10 వేల రూపాయలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం ఇలా… పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్టు ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం.. ఆన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 2వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.