...

Sad News: కన్న కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన తండ్రి… ఎక్కడంటే?

Sad News: సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే నలుగురు వ్యక్తులు కలిసి పాడి మోసుకొని తీసుకెళ్తాము లేదా శవాలను తరలించే వాహనాన్ని పిలిచి అంత్యక్రియలకు తీసుకెళ్తాము. కానీ శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కన్న తండ్రి కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన చత్తీస్గడ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

అమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్‌కు సురేఖ(7) అనే కూతురు ఉంది. గత నాలుగు రోజుల నుంచి సురేఖ తీవ్రమైన జ్వరంతో బాధ పడటం వల్ల చికిత్స నిమిత్తం సురేఖను లఖాన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు శుక్రవారం తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు సురేఖను పరీక్షించిన అనంతరం తనకు ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయని ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సురేఖ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మరణించింది.

హెల్త్ సెంటర్ లోనే సురేఖ కన్నుమూయడంతో ఆస్పత్రి ఆవరణంలో శవాలను మోసుకెళ్లే వాహనం అందుబాటులో లేకుండా పోయింది. ఇక చేసేదేమిలేక ఈశ్వర్ తన కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్తూ గ్రామానికి చేరుకున్నారు.ఇలా ఈశ్వర్ తన బిడ్డ శవాన్ని భుజాలపై వేసుకుని వెళ్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియోపై చత్తీస్గడ్ ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ దియోకు కూడా చేరాయి. దీంతో మంత్రి తీవ్రంగా స్పందించి, విచారణకు ఆదేశించారు. బిడ్డను మోసుకెళ్తున్న ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, దీనికి బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.