ఏపీలో పదో తరగతి పరీక్షలు.. వాటితో పాటు ప్రశ్నా పత్రాలు లీకులు కూడా కొనసాగుతున్నాయి. రోజూ పేపర్లు లీకువుతున్నాయంటూ ఏదో ఓ చోట వార్త వస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ రోజు సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఇంగ్లీషు పేపర్ లీకైంది. ఉదయం 10 గంటలకే వాట్సాప్ లో దర్శనం ఇచ్చింది. కోరనా కారణంగా రెండేళ్ల తర్వాత పరీక్షలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు.
పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నా పత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ వాటిని నియంత్రించడం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. మొదటి రోజు తెలుగు ప్రశ్నాపత్రం, రెండో రోజు హిందీ పేపర్ సామాజిక మాధ్యమాల్లో బయటకు వచ్చాయి. తాజాగా నేడు జురుగుతున్న ఆంగ్లం ప్రశ్నా పత్రం లీకైంది. పేపర్ లీక్ అవుతున్నా.. అడ్డుకోవడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పేపర్ లీక్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.