...

Viral news: ఎమ్మెల్సీ కారులో శవం.. చంపేశారంటూ బంధువుల ఆరోపణ!

Viral news : స్వయంగా తనో ప్రజాప్రతినిధి. ఆయన కారులో ఓ డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. మృతుడు ఆ ప్రజాప్రధి కారు డ్రైవరే. అసలు ఏం జరిగిందంటే.. కాకినాడలో ఓ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఉండటం కలకలం రేపింది. కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధిలోని వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంత బాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Viral news
Viral news

చనిపోయిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. గతంలో ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద డ్రైవర్గా పని చేసే వాడు. తీరా అదే కారులో శవమై కనిపించాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి సుబ్రహ్మణ్యాన్ని కారులోనే ఇంటి నుండి బయటికి తీసుకెళ్లాడని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు చెబుతున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సుబ్రహ్మణ్యం టిఫిన్ కోసం బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారని వారు వెల్లడించారు.

సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని తీసుకువచ్చిన అనంతబాబును కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో కారు వదిలి పరారయ్యాడని వాళ్లు చెప్పారు. యువకుడు కాళ్లు, చేతులు విరిచి మట్టిలో దొర్లించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతరబాబుపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటికి వచ్చి తీసుకపోయి శవంగా తిరిగి తీసుకువచ్చారని కన్నీరు మున్నీరవుతున్నారు. హంతకులపై చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also :Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?