...

Crime News: తమిళనాడులో దారుణం… ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!

Crime News: ఈ మధ్యకాలంలో పసి పిల్లలు, మహిళలు, ముసలివారు అని తేడా లేకుండా వారి మీద రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టిన కూడా ఇలాంటి నీచుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో బయటికి వెళ్ళిన ఒక ప్రేమ జంటను కొందరు యువకులు గమనించి ప్రియుడిని దారుణంగా కొట్టి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement

వివరాల్లోకి వెళితే…తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి ఆఫీస్ ముగిసిన తర్వాత తను ప్రేమించడానికి చంపడానికి అప్పుడు ఒక భవనం వద్దకు వెళ్లి ఇద్దరు అక్కడ కలుసుకునేవారు. అక్కడే ఉంటున్న కొందరు యువకులు వీరు కలుసుకోవటం చాలాసార్లు గమనించారు.

Advertisement

ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం రోజు కూడా యువతి తన బాయ్ ఫ్రెండ్‌ను కలిసేందుకు ఆ భవనానికి వెళ్లింది. ఇది గమనించిన యువకులు పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బలవంతంగా వేరే ప్రదేశానికి తీసుకువెళ్లారు. అనంతరం యువతి యువకుడి మీద దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబుతే చంపేస్తామని యువతిని బెదిరించి తిరిగి ఆమెను తీసుకెళ్లి స్థానిక బస్టాండ్ వద్ద వదిలేశారు.అదే సమయానికి అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు యువతి ఏడ్వడం గమనించి ఏమైందని ప్రశ్నించారు. యువతి పోలీసులకు జరిగిన దారుణం గురించి వివరించింది.పోలీసులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించి.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement