...

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. పురుగుల మందు తాగి యువతి యువకుడు ఆత్మహత్య…!

Crime News: ఈ మధ్య కాలంలో కొందరు ప్రజలు ప్రేమకు కులం,మతం, వయసు అడ్డు కాదని చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమించిన వారిని మొదలుకొని వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా వారిని మర్చిపోలేక మళ్లీ వారితో కలిసి జీవించడానికి దారుణాలకు వడికడుతున్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… విశాఖపట్టణం జిల్లాలోని కసింకోట మండలం మోసయ్యపేట పంచాయతీ శివారు గోకివానిపాలెంలో ఇద్దరు యువతీ యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మరణించిన వారిలో బుచ్చయ్య పేట గ్రామానికి చెందిన మజ్జి శ్రీనివాస్ అనే యువకుడు, చౌడువాడ గ్రామానికి చెందిన చల్లపల్లి హేమలతగా గుర్తించారు. వీరిద్దరూ కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల హేమలత వేరొక వ్యక్తితో వివాహం జరిగింది.

శ్రీనివాస్ చోడవరం బజాజ్ షో రూమ్ లో పని చేస్తున్నాడు. హేమలత కు వివాహం జరిగినా కూడా శ్రీనివాస్ తో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. హేమలత విషయం తెలుసుకున్న భర్త, తండ్రి ఆమెను మందలించగా శ్రీనివాస్ తో కలిసి ఇంటి నుండి పారిపోయింది. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం కూలి పనులకు వెళ్లిన కొందరు వ్యక్తులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.