Shocking news: పశ్చిమ బెంగాల్ బీర్బూమ్ జిల్లా ఖైరాషోల్ లో నివాసం ఉంటున్న జగబంధు హల్దార్ అనే ఓ యువకుడికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మల విసర్జన కూడా ఆగిపోయింది. మనం రెండు రోజులు మల విసర్జన చేయకపోతేనే.. ఇబ్బంది పడతాం. కానీ అతడు వారం పది రోజులుగా ఈ సమస్యతో ఇల్లాడిపోతున్నాడు. కడుపు ఉబ్బిపోవడం.. మల విసర్జన లేకపోవడం వల్ల విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మొదట్లో చిన్న సమస్యే అనుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్న మలం రాకపోవడం విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాడు.
స్కానింగ్ చేసి చూస్తే.. అందులో ఉన్న వాటిని చూసి వైద్యులే షాక్ కి గురయ్యారు. వెంటనే శస్త్ర చికిత్ చేయకపోతే చాలా కష్టమని వివరించారు. వెంటనే హల్దార్ ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. అన్నవాహికకు అడ్డుగా ఉన్న రెండు పెద్ద కణతులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి…. 25 కిలోల 500 గ్రాములున్న రెండు పెద్ద కణతులను తలగించారు. ఇకపై అతడు మామూలుగానే ఉంటాడని… ఇక ఎలాంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు.