Andhra Pradesh : జవాన్ ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవడం కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతికి ఇలా రావడం తప్పు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అమ్మాయికి నచ్చచెప్పి ఇంటికి పంపించిన పాపానికి ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. ఇలా ప్రేమించిన అమ్మాయితో తన తల్లిదండ్రులు తనపై వేధింపు కేసులు నమోదు చేయించి జవాన్ పై అధిక ఒత్తిడి తీసుకురావడంతో జవాన్ మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని మూలగానివారిపాలెంకి చెందిన సూర్య ప్రకాశ్ రెడ్డి ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే సెలవు నిమిత్తం ఈయన ఈనెల ఆరవ తేదీ వరకు తన స్వగ్రామంలో స్నేహితులతో ఎంతో సరదాగా గడిపి తన కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి తిరిగి సెలవులకు వస్తానని చెప్పి సంతోషంగా వెళ్లారు. అయితే ఇలా సంతోషంగా వెళ్లిన సూర్య ప్రకాష్ రెడ్డి ఆర్మీ క్యాంప్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుని పాల్పడ్డారు. ఈయన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాన్ని వస్తే అదే గ్రామానికి చెందిన విజయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కుమార్తె సూర్య ప్రకాష్ రెడ్డిని ప్రేమించింది.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉండగా ఆ యువతి ఇంటి నుంచి పారిపోయి వచ్చి తనని పెళ్లి చేసుకోమని అడగగా సూర్యప్రకాశ్ రెడ్డి ఇది తప్పని చెప్పి ఆ యువతని ఇంటికి పంపించారు.
Andhra Pradesh :జవాన్ ఆత్మహత్య ..
తన కుమార్తె సూర్య ప్రకాష్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని యువతీ తల్లిదండ్రులు బలవంతంగా ఆ యువతి చేత సూర్య ప్రకాష్ రెడ్డి తనని వేధింపులకు గురి చేశారంటూ బలవంతంగా కేసు నమోదు చేయించారు.ఈ విధంగా సూర్య ప్రకాష్ రెడ్డి పై కేసు నమోదు చేయడమే కాకుండా కొందరు పోలీసులు విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు సూర్యప్రకాష్ రెడ్డికి తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.ఇలా విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు తనని బెదిరించడంతో అధిక ఒత్తిడికి గురైన సూర్య ప్రకాష్ ఆర్మీ క్యాంప్ క్వాటర్స్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషయం సొంత గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తున గ్రామస్తుల జాతీయ జెండాను పట్టుకొని పోలీస్ స్టేషన్ పై ఆందోళనకు దిగడమే కాకుండా తమ కుమారుడి పై బెదిరింపులకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తిరిగి సెలవులకు వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు ఇలా విగతా జీవిగా రాబోతున్నారని తెలియడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also : Zomato Delivery boy: చంటి పిల్లను భుజాన కట్టుకొని.. జొమాటో డెలివరీ చేస్తున్న తండ్రి!