Liger Movie Video : విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటించిన లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు. ఇప్పుటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి భారీ బజ్ క్రియేట్ అయింది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, పాటలు, వీడియోలు… సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా.. దేశమంతా చుట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నిహారిక ఎన్.ఎం సోషల్ మీడియా యూజర్.. సినిమా తారలతో రకరకాల వీడియోలు చేస్తుంది.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
వాటిని తన ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లలో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కూడా ఓ ఫన్నీ వీడియో చేసింది. ఇందులో ఈ బ్యూటీ విజయ్ తో ఫైటింగ్ చేసింది. ఆ తర్వాత అతడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిది. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. విజయ్ తో ఫైట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరంటూ కామెంట్లు చేస్తున్నారు.