Telugu NewsLatestGajuwaka Conductor : నేనట్టాంటి ఇట్లాంటి ఆడపిల్లను కాను బావో అంటూ దుమ్ము రేపిన బస్...

Gajuwaka Conductor : నేనట్టాంటి ఇట్లాంటి ఆడపిల్లను కాను బావో అంటూ దుమ్ము రేపిన బస్ కండక్టర్!

Gajuwaka Conductor : సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతున్న పాటలకు పెద్ద ఎత్తున డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేనట్టాంటి ఇట్లాంటి ఆడపిల్లను కాను బావో.. పల్సర్ బైక్ పైన రారో బావో అనే పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ పాటకు సోషల్ మీడియాలో ఎన్నో డాన్స్ వీడియోలు చేస్తూ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఒక లేడి కంటెస్టెంట్ డాన్స్ చేయడం వైరల్ అవుతుంది.

Advertisement

అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటే అక్కడే పొరపాటు పడినట్లే.సాధారణంగా వేదికపై కంటెస్టెంట్లు డాన్స్ చేయడం సర్వసాధారణం అదే ఒక ఏపీఎస్ఆర్టీసీ గాజువాక డిపో కి చెందిన ఒక బస్ కండక్టర్ ఇలా వేదిక పైకి వచ్చి డాన్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఈమె ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చూసిన మల్లెమాలవారు ఈమెను ఏకంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇలా వేదికపై ఈ పాటకు ఆ యువతి డాన్స్ చేయడంతో ఒక్కసారిగా వేదిక మొత్తం దద్దరిల్లి పోయిందని చెప్పాలి.

Gajuwaka Conductor : శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో డాన్స్ వీడియో వైరల్.. 

ఇక ఈమె మాస్ పర్ఫామెన్స్ చూసిన అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆమెతో కలిసి డాన్స్ చేయడానికి ఆసక్తి చూపించారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన నటి ఆమని సైతం నావల్ల కాలేదు నాకు కూడా వచ్చి డాన్స్ చేయాలనిపించింది అంటూ వేదిక పైకి వెళ్లి ఆమని రష్మీ అందరూ కలిసి ఆమెతో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కప్పల పెళ్లి అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఇంకేంటి ఆలస్యం లేడీ కండక్టర్ వేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Advertisement

admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు