Accident: ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని దుర్మరణం…!

Accident: ప్రతిరోజు దేశంలో ఎన్నో చోట్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాల వాడకం పెరిగిపోవడం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాహనాన్ని నడిపే వారు అజాగ్రత్త అతి వేగం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని దుర్మరణం చెల్లింది.

వివరాల్లోకి వెళితే… విశాఖపట్టణంలో షిప్‌యార్డు క్వార్టర్స్‌లో నివసిస్తున్న జెర్రిపోతుల రామ్మోహన్‌రావు కుమార్తె జెర్రిపోతుల హారిక అనే యువతి విశాఖ  ఎయిర్‌పోర్టులో కస్టమర్‌ ఎయిర్‌ ఇండియా సర్వీసెస్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం డ్యూటీ కి వెళుతున్న సందర్భంలో రామ్మోహన్‌రావు ద్విచక్ర వాహనంపై కూతురిని ఎయిర్ పోర్ట్ లో దింపటానికి బయలుదేరారు.

Advertisement

ఈ తరుణంలో ఉదయం 11 గంటల సమయంలో వారు ద్విచక్రవాహనం పై షీలానగర్‌ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న డివైడర్‌ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆర్‌టీసీ బస్సు అదుపుతప్పి మీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కింద పడిపోవడంతో రామ్మోహన్‌రావుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హారిక తలకు బస్సు టైరు తాకటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను ఎయిర్ పోర్ట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న గాజువాక ఎస్సై మృతురాలి తండ్రి నీ విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement