Samantha:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత తన భర్త నాగచైతన్యతో అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ఈ జంట విడాకుల ప్రకటన చేసిన తర్వాత కొన్ని రోజులపాటు ఎంతో బాధలో ఉన్న సమంత పలు ఆలయాలు విదేశీ పర్యటనలు చేస్తూ తన బాధను మొత్తం మరిచిపోయి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలా విడాకులు ప్రకటన తర్వాత సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఒక వైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన జీవితానికి సంబంధించిన విషయాల గురించి పరోక్షంగా ఈమె స్పందిస్తుంటారు. ఇలా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు.ఎవరికైతే వారి జీవితంలో ఎంతో చేదు సంఘటనలు జరుగుతాయో అవి వారి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగడానికి ఉపయోగపడతాయి అంటూ చెప్పుకొచ్చారు.
ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే ఈ ఏడాది తనకు ఏ విధమైనటువంటి హోప్స్ లేవని వెల్లడించారు. గత ఏడాది తాను తన జీవితం గురించి ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నానని అయితే ఆ ప్రణాళికలు అన్నీ కూడా శిథిలమై పోయాయి. అందుకే ఈ ఏడాది తన జీవితంపై తనకు ఎలాంటి అంచనాలు లేవని తెలియజేశారు.తన జీవితంలో ఏదైతే దృఢంగా స్థిరంగా ఉంటుందో దానిని స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో సమంత పరోక్షంగా విడాకుల గురించి ఈ పోస్ట్ చేశారంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World