...

KGF 2 Movie Release Date : కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఆ తేదీనే పక్కా రిలీజ్..!

KGF 2 Movie Release Date : కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1 మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శ్రీనిధి శెట్టి జోడీగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసుల రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ఆ మూవీకి సీక్వెల్‌గా ‘KGF : చాప్టర్ 2’ మూవీ రాబోతోంది.

Advertisement

ఎప్పటినుంచో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. దీనికి యూట్యూబ్‌లో 230 మిలియన్‌లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Advertisement

కన్నడ సినీ చరిత్రలో అత్యధిక స్థాయిలో వ్యూస్ రావడం ఈ మూవీ టీజర్‌కు మాత్రమే.. బాహుబలి: ది కంక్లూజన్” రికార్డును KGF 2 టీజర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యాక మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో కేజీఎఫ్ 2 ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. అందిన సమాచారం ప్రకారం.. దర్శక నిర్మాతలు అభిమానులకి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

ఈ మూవీలో మొదటి పాటను ఈ నెల 25న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారట.. ఈ మొదటి సాంగ్‌ను కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. భారీ అంచనాలతో KGF 2 మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement

Read Also : Prabhas: ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!

Advertisement
Advertisement