...
Telugu NewsEntertainmentJabardasth Varsha: ఆడవారికి ఏ మాత్రం విలువ లేదా... ఎమోషనల్ అయినా జబర్దస్త్ వర్ష.. ఏం...

Jabardasth Varsha: ఆడవారికి ఏ మాత్రం విలువ లేదా… ఎమోషనల్ అయినా జబర్దస్త్ వర్ష.. ఏం జరిగిందంటే?

Jabardasth Varsha: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో చేస్తూ ప్రేక్షకులకు కావలసినంత అందిస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్.ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమం మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రతివారం ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జబర్దస్త్ కమెడియన్స్ వారి తల్లులతో వేదిక పైకి వచ్చారు.

Advertisement

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ వారి తల్లికి పాదాభి వందనములు చేస్తూ వారందరినీ ఎంతో ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఆడవారిపై జరిగే అన్యాయం, దారుణాల గురించి పలువురు స్కిట్లు రూపంలో తెలియజేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాట విని కొడుకు తల్లిని ఎంతో దారుణంగా అవమానిస్తూ బయటకు గెంటేయడం ,అలాగే ఒకసారి కూతురు పుట్టి మరోసారి గర్భవతి అనే విషయాన్ని భార్య ఎంతో సంతోషంగా భర్తకూ చెబితే ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ప్రాణం తీస్తా అంటూ తనపై విచక్షణారహితంగా దాడి చేయడం వంటి సంఘటనలను స్కిట్ రూపంలో తెలియజేశారు.

Advertisement

ఇలా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ క్రమంలోనే ఈ స్కిట్ చూసిన కొందరు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ వర్ష సైతం ఈ సన్నివేశాలను చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సంఘటనలన్నీ సమాజంలో ప్రతి రోజూ ఎన్నో జరుగుతున్నాయి ఆడదాని బతుకు ఇంతేనా వారికి ఏమాత్రం విలువ లేదా అంటూ జబర్దస్త్ వర్ష కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు