Anchor Anasuya: ఇన్నేళ్ళ నీ ప్రేమలో అనేక కోణాలు చుసానంటూ భర్తతో కలిసి హ్యాపీ మూడ్ లో ఉన్న అనసూయ.. కారణం అదేనా?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలు షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ తన వ్యక్తిగత జీవితాన్ని గడపటం కోసం ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటారు.ఈ క్రమంలో తన భర్త పిల్లలతో కలిసి తరచూ హాలిడే వెకేషన్ వెళుతూ ఉండే అనసూయ తాజాగా మరొకసారి తన కుటుంబంతో కలిసి సముద్రతీరాన ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అనసూయ వెకేషన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పొట్టి దుస్తులు ధరించి అందాల జాతర చేస్తున్న అనసూయ సముద్రతీరాన సముద్ర అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా తన భర్త పై ముద్దుల వర్షం కురిపిస్తూ తనతో ఎంతో సరదాగా గడుపు తున్నారు.అయితే అనసూయ ఈ విధంగా తన భర్తతో సంతోషంగా ఉండడానికి కూడా ఓ కారణం ఉంది. అనసూయ తన 12వ వివాహ వార్షికోత్సవాన్ని ఇలా తన భర్తతో ఎంతో ఎంజాయ్ చేస్తూ జరుపుకున్నారు.

ఈ సందర్భంగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ 21 సంవత్సరాల పాటు నీతో కలిసి ఉంటున్న,12 ఏళ్ల వివాహ జీవితం.. నీతో గడిపిన ఇన్నేళ్ళలో నీ ప్రేమలో అనేక కోణాలు చూశాను. ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ యానవర్సరీ అంటూ అనసూయ కామెంట్ పెట్టింది. ఇలా తన భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన పై ముద్దుల వర్షం కురిపించింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel