Deepthi Sunaina: పెళ్లి కూతురు గెటప్ లో మంచు కొండలలో స్టన్నింగ్ లుక్ లో దీప్తి సునైనా… వీడియో వైరల్!

Deepthi Sunaina: యూట్యూబ్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి పలు వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ద్వారా షణ్ముఖ్ ప్రవర్తన కారణంగా పూర్తిగా నెగిటివిటీ ఎదుర్కొన్న షణ్ముక్ తో దీప్తి సునయన నూతన ఏడాది సందర్భంగా తన ప్రేమకు బ్రేకప్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో అభిమానులు పెద్దఎత్తున వీరి సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎలాంటి పోస్టులు చేసిన క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం పార్టీలు చేసుకోవడమే కాకుండా పలు డాన్స్ వీడియోలను చేస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.దీప్తి సునైనా రచ్చ చూస్తుంటే బ్రేకప్ చెప్పుకున్నామనే బాధ ఏమాత్రం కనిపించడం లేదు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Deepthi Reddy 🇮🇳 (@deepthi_sunainaa)

Advertisement

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తాజాగా మరో నటుడితో కలిసి మంచుకొండలలో పెళ్లి కూతురు గెటప్ లో, స్టన్నింగ్ లుక్ లో అందరినీ సందడి చేశారు. ఇక మంచు కొండలలో దీప్తి సునయన చేస్తున్న రచ్చ మామూలుగా లేదు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకొన్న తర్వాత తొందరలోనే వీరిద్దరూ తిరిగి కలుస్తారని ఎంతోమంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరి వ్యవహారం చూస్తుంటే మాత్రం అభిమానుల కోరిక ఇప్పుడే తీరేలా లేదని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel