Tirupati : కిచెన్ లో వింత శబ్దాలు రావటంతో వెళ్లి చూసిన కుటుంబసభ్యులు.. ఒక్కసారిగా షాక్..!

Updated on: August 4, 2025

Tirupati: ఈ రోజుల్లో దేశంలో జనాభా సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో వల్ల దేశంలో ఉన్న అడవులు మాయమయి ఇల్లు వెలుస్తున్నాయి. అందువల్ల అడవిలో ఉండాల్సిన జంతువులు, పక్షులు, కీటకాలు అప్పుడప్పుడు జనావాసాల మధ్య దర్శనమిస్తున్నాయి. అచ్చం ఇటువంటి సంఘటన తిరుపతి లో చోటు చేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన సర్పం ఇంట్లో దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే..తిరుమల బాలాజీ నగర్ లోని ఓ ఇంట్లో పాము హల్చల్ చేసింది.

తిరుపతిలో అడవికి సమీపంలో ఉన్న బాలాజీ నగర్ లోని ఒక ఇంట్లో ఇటీవల కిచెన్ నుండి వింత శబ్దాలు వినిపిస్తాయి. మొదట ఈ విషయాన్ని తేలికగా తీసుకున్న కుటుంబ సభ్యులు తర్వాత ఆ శబ్దాలు ఎక్కువగా వస్తుండటంతో అనుమానం వచ్చింది
దీంతో కుటుంబసభ్యులు ఆ వింత శబ్దాలు కు గల కారణం గురించి తెలుసుకోవడానికి లోపలికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అడవుల్లో ఉండాల్సిన పెద్ద సర్పం కిచెన్ లో దర్శనం ఇచ్చేసరికి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే భాస్కర్ నాయుడు అనే స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు.

భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని కిచెన్ లో తిరుగుతున్న పాముని చాకచక్యంగా తన చేతులతో బంధించి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశాడు. ఈ ఘటన మొత్తం కుటుంబ సభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషియల్ మీడియా లో వైరల్ గా మారింది. దయచేసి అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించేవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇటువంటి విష సర్పాల కారణంగా ప్రమాదం ఎదుర్కోవల్సి వస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel