...

Radhe Shyam Premiere Show : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ ప్రీమియర్ షో.. పడేది ఆ థియేటర్లోనే..!

Radhe Shyam Premiere Show : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాప్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న (Radhe Shyam March 11 release date) రిలీజ్ కాబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Advertisement

అయితే మార్చి 11న రిలీజ్ కానున్న రాధేశ్యామ్ ఫస్ట్ ప్రీమియర్ షో ఒకరోజు ముందుగానే పడనుంది. అది కూడా ఏ థియేటర్‌లో ఫస్ట్ ప్రీమియర్ షో వేయనున్నారో లీక్ అయింది. అందిన లీక్ సమాచారం ప్రకారం.. కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్‌‌లో బెనిఫిట్ షో వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ థియేటర్ నుంచే రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు శ్రేయాస్ మీడియా సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

Advertisement
Radhe Shyam Premiere Show To be Released First on This Theater Only, Prabhas, Pooja Hegde Lead Roles
Radhe Shyam Premiere Show To be Released First on This Theater Only, Prabhas, Pooja Hegde Lead Roles

రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కావడానికి ముందే రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ అయిపోయాట.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

Advertisement

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో ముందుగానే చెప్పేశారు ప్రముఖ సినీ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు.. రాధేశ్యామ్ మూవీని తాను చూశానని రివీల్ చేశారు. ఈ మూవీలో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అన్నారు. ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ పూజా హెగ్డే మధ్య లవ్ సీన్స్ అద్భుతుంగా ఉన్నాయని, ఉమైర్ సంధు కామెంట్ చేశారు. రాధేశ్యామ్‌లో క్లైమాక్స్ ప్లస్ పాయింట్ అని, అసలు ఎవరూ ఊహించినట్టుగా ఉంటుందని చెప్పారు.

Advertisement

ప్రభాస్ తన నటనతో అద్భుతంగా నటించాడని చెప్పారు. అలాగే రాధేశ్యామ్ ఒక ఎపిక్ (Epic) అంటున్నారు. ప్రభాస్ స్టయిల్, ఆయన క్లాస్ సినిమాకే పెద్ద హైలట్ అని, ఆయనకు ఆయనే సాటి అంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. దాంతో రాధేశ్యామ్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి.

Advertisement

Read Also : Ram Charan : రామ్ చరణ్ -శంకర్ మూవీ టైటిల్ ఇదేనట..? మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. రెండు డిఫరెంట్ రోల్స్‌లో చెర్రీ..!

Advertisement
Advertisement