Health Tips: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. అందమైన, కాంతివంతమైన చర్మం కోసం చాలా మంది వేల రూపాయలు ఖర్చుపెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందమైన కాంతివంతమైన చర్మం కోసం చేపనూనె అద్భుతంగా పనిచేస్తుంది. చేప నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలోనూ ఎంతో ఉపయోగపడతాయి. చేప నూనె వల్ల చర్మ సౌందర్యం ఎలా రెట్టింపు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
వాతావరణ కాలుష్యం వల్ల చర్మం మీద మొటిమలు వస్తాయి. మొటిమలు తగ్గిన తరువాత కూడా వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉంది అంద విహీనంగా కనిపిస్తాయి. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగించటానికి చేప నూనె బాగా ఉపయోగ పడుతుంది. ప్రతిరోజు చేప నూనె మచ్చల మీద మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయటం వల్ల మచ్చలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.
సాధారణంగా వయసు పెరిగే కొద్ది ముఖం మీద ముడతలు ఏర్పడుతాయి. ప్రతి రోజూ చేప నూనెతో ముఖం మీద మసాజ్ చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల క్రమంగా ముడుతలు తగ్గుతాయి.
చర్మ తరచూ పొడిబారుతుంటే చేప నూనె ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఇందుకోసం చేప నూనె, తేనె సమపాళ్లలో కలుపుకొని ముఖానికి రాసుకోవాలి.10 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World