Crime News: కూతురిని మందలించిన తల్లి.. మనస్తాపంతో దారుణానికి ఒడిగట్టిన యువతి..!

Crime News: ప్రస్తుత కాలంలో పిల్లలు తల్లిదండ్రుల మాటకు అసలు విలువ ఇవ్వటం లేదు. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినడం మానేసి ఇ.. తల్లిదండ్రులే పిల్లలు చెప్పినట్టు చేసే పరిస్థితి ఏర్పడింది. పిల్లల మాట కాదని తల్లిదండ్రులు వారిని దానికి కూడా భయపడుతున్నారు. వారు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతారో అన్న భయంతో ఇష్టానుసారం వారిని వదిలేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు బాగా బానిసలై పోతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద వారి చదువు మీద కూడా చూపుతోంది. సెల్ ఫోన్ ఎక్కువగా చూడొద్దని ఇచ్చినందుకు యువతి దారుణానికి పాల్పడింది.

pjimage 2022 03 06T141737.739వివరాలలోకి వెళితే.. సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తూ చదువు మీద అ శ్రద్ధ చూపటం లేదని తల్లి వివరించినందుకు యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ అనే వ్యక్తి కుంకుమ వ్యాపారం చేస్తూ తన కుటుంబంతో కలిసి తిరుమలలో జీవనం సాగిస్తున్నాడు. బాలాజీ కుమార్తె వాణిశ్రీ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సెల్ఫోన్ కు బాగా అలవాటు పడిన వాణిశ్రీ తరుచూ సెల్ఫోన్ చూస్తూ చదువులు ఆశ్రద్ధ చేసేది.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వాణిశ్రీ చదవకుండా ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ ఉండటంతో ఇది గమనించిన తల్లి సెల్ఫోన్ చూస్తూ చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదంటూ కూతురు ని గట్టిగా మందలించింది. తల్లి మందలించడంతో సెల్ ఫోన్ పక్కన పెట్టి నిద్ర
పోవటానికి వెళ్ళింది. తల్లి తనను మందలించడంతో మనస్థాపం చెందిన వాణిశ్రీ ఇంటి పైన ఉన్న గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వాణిశ్రీ నీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని యస్ వి మెడికల్ కాలేజీ కి తరలించారు.