Extra Jabardasth : ఈటీవీలో ప్రతీ వారం రెండు రోజులు ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో జడ్జిలుగా రోజా మరియు మనో లు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు రోజా లేదా మనో ల్లో ఎవరో ఒకరు ఏదో ఒక పని కారణంగా హాజరు కాకపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ సమయం లో గెస్ట్ జడ్జిలుగా కొందరు వస్తూ ఉన్నారు.
అలా గెస్ట్ జడ్జిగా వచ్చిన వారిలో ఒకరు ఇంద్రజా. గెస్ట్ జడ్జిగా వచ్చిన ఇంద్రజ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆమె రెగ్యులర్ గా రావాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాని రోజా మళ్లీ రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కి జడ్జి గా ఇంద్రజ కు వ్యవహరించే అవకాశం దక్కింది. ఇప్పుడు జబర్దస్త్ గెస్ట్ జడ్జిగా ఆమనిని తీసుకు వస్తున్నారు.
రోజా తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆమని గత రెండు వారాలుగా జబర్దస్త్ జడ్జిగా సందడి చేస్తోంది. జబర్దస్త్ ఒక్కొక్క ఎపిసోడ్ కి రూ. 5 లక్షల పారితోషికం ఇతర ఇస్తారని సమాచారం అందుతోంది. రోజా కంటే కాస్త తక్కువ పారితోషకాన్ని ఇస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ రెగ్యులర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజకు కూడా అదే స్థాయిలో పారితోషికం ఇస్తున్నారని సమాచారం అందుతోంది.
Read Also : International Women’s Day 2022 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా?