Devatha: మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ దేవత. మరి ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ విడుదలైయ్యింది దాని హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
పటేలు స్టైలిష్‌గా రెడీ అయ్యి పక్కింటి ఆవిడకు సైట్‌కొడుతూ రాకెట్లు విసరుతుంటాడు. ఇదంతా కమల బాష గమనిస్తుంటారు. అంతలో అక్కడికే వచ్చి పటేల భార్య ఆ రాకెట్లను చూసి ఏంటిది అని ప్రశ్నిస్తుంది. ఇందంతా చూస్తున్న బాష భలే ఇరుక్కున్నాడు పటేలా అంటూ సంతోషపడుతుంటాడు.
దేవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. సత్య తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు అని ఆదిత్య అంటూ దగ్గరికి వెళ్తుంది.. అంతలో సత్య కాలుజారి స్లిప్ అవుతుండగా ఆదిత్య గట్టిగా పట్టుకుంటాడు.. పట్టపగలు ఏంటిది అది ఎవరైనా చూస్తే బాగోదు అంటూ తెగ సిగ్గుపడుతుంది. అంత ఇంట్రెస్ట్‌లేదు నువ్ మరీ మురిసిపోకు అంటాడు ఆదిత్య. ఏంటి ఫోన్లో ఎవరి ఫోటో చూస్తున్నావు అంటుంది సత్య.
ఇక ఆదిత్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయగా ఆదిత్య ఇవ్వకుండా తప్పించుకుంటుండగా పోన్‌లోని ఫోటోని చూస్తుంది సత్య. ఎప్పుడూ నీకు దేవి ధ్యాసే నా ఫోన్లో కూడా తన ఫోటోలు చూస్తూనే ఉన్నావా అని కోపం పడుతుంది. దేవి మాయలో పడిపోతున్న ఆదిత్యను కాపాడుకోవడం కోసం.. ఆదిత్య ఫోన్లో ఉన్న దేవి ఫోటోలు అన్ని డిలీట్ చేస్తుంది సత్య. ఇక ఆదిత్య తను కలిసి ఉన్న ఫోటోను తన ప్రొఫైల్ పిక్‌గా పెడుతుంది. ఈ ఫోటో చూసినప్పుడల్లా నేను ఇంట్లో వాళ్ళందరూ నీకు గుర్తుకురావాలి. అంటూ ఆదిత్యకు తన ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సత్య.
Tufan9 Telugu News And Updates Breaking News All over World