Crime News : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొదట ఇద్దరు మృతి చెందగా… కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కల్లు శాంపిల్స్‌ను సేకరించారు.
పూర్తి వివరాలలోకి వెళ్తే… జిల్లా లోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారికి వికారంగా ఉండి, కడుపులో నొప్పి మొదలైంది. కడుపు నొప్పి అనంతరం వాంతులు, విరోచనాలు కావడంతో వారిని గడ్డంగికి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం అందించారు.
వైద్యం జరుగుతుండగా ఆ ముగ్గురు కూడా మృతి చెందారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం సీరియస్ అయింది. తాగిన కల్లు శాంపిల్స్ ను కూడా ల్యాబ్ కు పంపించారు. అయితే కల్తీ కల్లు తాగడం వల్లే ఈ ఘటన జరిగిందా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఐదుగురి మరణంతో లోదొడ్డి గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఆ ఐదు కుటుంబాలు కూడా వీరి మరణంతో అనాథలయ్యాయి. కేవలం కల్లు తాగడం వల్లే ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Read Also : Devotional News : ఎంత కష్టపడ్డా ఇంట్లో డబ్బు సమస్య ఉంటుందా… అయితే ఇవి పాటించండి !
Tufan9 Telugu News And Updates Breaking News All over World