Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Man Rape Dog : కామంతో కళ్ళు మూసుకుపోయి… చివరికి కుక్కను కూడా అలా!

Man Rape Dog : నేటి సమాజంలో కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతలా దిగజారిపోతున్నారంటే మనుషుల నుంచి నోరు లేని మూగ జీవాలను కూడా వదలని దు

By Ramesh Babu

Published on: February 12, 2022 6:06 PM

Updated on: February 13, 2022 1:25 AM

man-raped-dog-in-hyderabad-know-full-details-about-it

---Advertisement---

Man Rape Dog : నేటి సమాజంలో కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతలా దిగజారిపోతున్నారంటే మనుషుల నుంచి నోరు లేని మూగ జీవాలను కూడా వదలని దుస్థితికి చేరారు. తాజాగా శునకంపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడి కథ బట్టబయలైంది. ఈ దారుణం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా… సీసీ ఫుటేజ్ గమనించిన స్థానికులు ఆ ఘటనను చూసి నివ్వెరపోయారు. ఆ వెంటనే జంతు హక్కుల కార్యకర్తలకు పంపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నల్లకుంటలో చోటు చేసుకుంది.

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింహ బస్తీలో ఓ వ్యక్తి గత మూడు రోజులుగా ఒక కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇది గమనించిన కొందరు వ్యక్తులు సీసీ టీవీ ఫుటేజ్ వీడియోను జంతు హక్కుల కార్యకర్తలకు పంపారు. ఈ వీడియోని చూసి వారు కూడా షాక్ అవుతున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Advertisement

కాగా జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11(A) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మూగజీవి పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ఉన్మాదిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియా లో హల్ చల్ అవుతుండగా… వీడియోని వీక్షించిన వారంతా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also : Cashew Benefits for male : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!

, , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.