Tips For Marriage : పెళ్లి విషయంలో సమస్యలా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !

Updated on: January 22, 2023

Tips For Marriage : పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఇంట్లో ఉంటే ఇరుగుపొరుగు వారు, బంధువులు మొదటగా అడిగే ప్రశ్న.. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు, మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు అని. ఈ ప్రశ్న, సదరు యువతీ, యువకుడికి కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే, కొందరికి వివాహం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్లు కుదరవు. ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.

tips-for-marriage-problems-for-young-boys-and-girls
tips-for-marriage-problems-for-young-boys-and-girls

అవి వారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తాయి. వయసు పెరిపోతుండటం, పెళ్లి ఇంకా అవకపోవడంతో మానసిక ఆందోళనలు రేకెత్తుతాయి. మీకు కూడా ఇలాంటి సమస్యల కారణంగా పెళ్లి జరుగకపోతున్నట్లయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే వివాహం విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుందట. మరి ఆ వాస్తు టిప్స్ ఏంటో మీకోసం…

మంచం ఏ దిశలో పడుకోవాలంటే.. పెళ్లికాని స్త్రీ ఇంటి వాయువ్య దిశలో నిద్రపోవాలి. ఇంటి నైరుతి మూలలో అస్సలు నిద్రించకూడదు. ఇలా చేయడం ద్వారా పెళ్లి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా, అవివాహితుడైన యువకుడు ఈశాన్య దిశలో పడుకోవాలి. ఆగ్నేయ దిశలో పడుకోకూడదు. భారీ వస్తువులు..

Advertisement
tips-for-marriage-problems-for-young-boys-and-girls
tips-for-marriage-problems-for-young-boys-and-girls

ఇంటి మధ్యలో బరువైన వస్తువులు లేదా మెట్లను ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఇది వివాహ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. బరువైన వస్తువులు ఇంట్లో ఉండటం.. వివాహం విషయంలో శ్రేయస్కరం కాదు.

 

బెడ్‌షీట్ రంగు.. పింక్, పసుపు, లేత ఊదా, తెలుపు వంటి లేత రంగు బెడ్ షీట్ మీద నిద్రించడం మంచిది. ఇది గదిలో సానుకూల శక్తిని పెంచుతుంది. వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తికి సానుకూల శక్తిని ఇస్తుంది.

Advertisement

దుస్తుల రంగు .. వాస్తు శాస్త్రం ప్రకారం.. అవివాహిత స్త్రీ పురుషులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఈ రంగు అశుభంగా పేర్కొంటారు. ఈ రంగు నిరాశకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రంగు.. వివాహానికి అడ్డంకులుగా ఉన్న శని, రాహువు, కేతువులను సూచిస్తుంది. వీలైతే.. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ బట్టలు ధరించాలి.

Read Also : Mirror Vastu Tips : ఇంట్లో అద్దం ఆ వైపు పెడితే భార్యభర్తలు విడిపోతారట.. మరోవైపు పెడితే అల్లకల్లోలమే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel