Ys Jagan : ఏపీ ప్రభుత్వానికి షాక్… సమ్మె బాట పట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు !

Updated on: January 23, 2022

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో వివాదం తలెత్తుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సినిమా టికెట్ వివాదం, ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్‌ ప్రభుత్వం సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్‌ పేల్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది ప్రకటించి ఊహించని షాక్‌ ఇచ్చారు.

పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ద‌శ‌ల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ( హంస‌) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేష‌న్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ ( ఏపీ హంస‌) అధ్యక్షుడు అర‌వ పాల్ వెల్లడించారు. పీఆర్సీ జివోలు ర‌ద్దు చేయాలని.. చర్చలు ముగిసే వ‌ర‌కు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 11 పీఆర్సీ పై అశితోష్ మిశ్రా క‌మిటీ నివేదిక‌ను అమ‌లు చేయాలని… ఈ పోరాటంలో డాక్టర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

దీని వల్ల క‌రోనా, ఇత‌ర వైద్య సేవ‌ల‌కు కొంత అంత‌రాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యుల‌ర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ఈ పోరాటంలో పాలు పంచుకుంటారని వారు తెలిపారు. తమ డిమాండ్లు ప‌రిష్కారం కాకుంటే అత్యవసర వైద్య సేవ‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. పెద్ద మనస్సుతో ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. మరి ఇప్పుడు సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Read Also : మన భారతీయ నదుల గురించి ఆస్తకిరమైన వాస్తవాలు ఇవే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel