...

Bangaraju Collections : ఏపీలో ఏ సినిమా సంపాదించుకోనంత క్రేజ్.. బంగార్రాజుకే ఎందుకు..?

Bangaraju Collections : సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. తెలుగులో రిలీజైన ఏ సినిమా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. వేరే ప్రాంతాలన్నింట్లో బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ స్టేటస్ అందుకున్న ‘పుష్ప’ మూవీ కూడా ఏపీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను ఏపీ మొత్తానికి రూ.45 కోట్లకు పైగా రేటుతో అమ్మారు. చివరికి చూస్తే అక్కడ వచ్చిన షేర్ రూ.30 కోట్లే.దీన్ని బట్టే ఈ సినిమా ఏపీ స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని కంటే ముందు రిలీజై బ్లాక్ బస్టర్ అయిన ‘అఖండ’ సైతం ఏపీలో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

Advertisement

దాని మీద పెట్టుబడులు తక్కువ కావడం వల్ల బ్రేక్ ఈవెన్‌ అయినప్పటికీ పెద్దగా లాభాలైతే తెచ్చిపెట్టలేదు. దీనికంతటికీ కారణం ఏపీలో టికెట్ల ధరలు తగ్గించడమే అనడంలో సందేహం లేదు. ధరల నియంత్రణ మొదలైంది ‘వకీల్ సాబ్’ మూవీతో అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కూడా ఏపీలో అండర్ పెర్ఫామ్ చేసింది.ఆ తర్వాత ఇప్పటిదాకా అన్ని సినిమాలకూ ఇదే ఒరవడి కొనసాగింది. ఐతే ఇప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజైన ‘బంగార్రాజు’ మాత్రం ట్రెండ్ మార్చింది. ఈ సినిమాకు కూడా టికెట్ల ధరలు ఏపీలో తక్కువగానే ఉన్నప్పటికీ.. మంచి ఆక్యుపెన్సీ రావడంతో వసూళ్లు బాగున్నాయి. మిగతా సినిమాలకు పూర్తి భిన్నంగా ఏపీ కాకుండా మిగతా ఏరియాల్లో ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు రావట్లేదు.

Advertisement

తెలంగాణలో తొలి రోజు నుంచి ఈ సినిమాకు సరైన వసూళ్లు లేవు. ఓవర్సీస్‌లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావట్లేదు. కర్ణాటక మిగతా ప్రాంతాల్లో ప్రభావం అంతంతమాత్రమే. కానీ ఏపీలో మాత్రం వసూళ్లు అంచనాలను మించి వస్తున్నాయి.తొలి వారాంతంలో ఈ సినిమాకు రూ.22 కోట్ల షేర్ వస్తే.. తెలంగాణలో అటు ఇటుగా రూ.5 కోట్ల షేరే వచ్చింది.

Advertisement

ఆంధ్రా, రాయలసీమల్లో కలిపి దీనికి రూ.15 కోట్ల దాకా షేర్ రావడం విశేషం. సీడెడ్ వాటా రూ.4.5 కోట్లు. మిగతా వసూళ్లన్నీ ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినవే. సంక్రాంతికి తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్లంతా తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడే సినిమాలు చూడటం.. ఇది పక్కా ఆంధ్రా వాళ్లు కనెక్టయ్యే పండుగ సినిమా కావడం ఇందుకు కారణం కావచ్చు. అయినా సరే.. తెలంగాణలో సినిమా ఇంత డల్లుగా నడుస్తుండటం ఆశ్చర్యకరమే.

Advertisement

Read Also : Guppedantha Manasu : దిక్కుమాలిన అంటూ జగతిని దారుణంగా బాధ పెట్టిన దేవయాని!

Advertisement
Advertisement