ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతోంది.ఈ ఏడాది చివర్లోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వైసిపి రెబెల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశా రఘురామకృష్ణంరాజు రాజీనామా ఉండవచ్చు.రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లోగా నర్సాపురం పార్లమెంటు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.
అయితే ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడో డిసైడ్ అయ్యారు.రాజీనామా చేసిన వెంటనే ఆ పార్టీలో చేరుతారు.ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసిన వైసీపీయేతర పార్టీల సహకారం తీసుకున్నారు. వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణంరాజు లాగానే ఎన్నిక జరిగేలా ఆయన చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ కొమ్ములు వంచాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడగొట్టాలి.అందుకే ఆయన అడక్కపోయినా అన్ని పార్టీల నుండి మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నరసాపురంలో గత ఎన్నికల్లోనే వైసీపీకి పెద్దగా మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కేవలం 35 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.
నరసాపురంలో సామాజికవర్గాల పరంగా చూసిన ప్రత్యర్థులను తక్కువంచనా వేయలేం. క్షత్రియులు, కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇద్దరు కలిస్తే వైసీపీకి విజయం కష్టమే.అందుకే లెక్కలు వేసుకుని మరీ రాజుగారు బరిగీసారు. జగన్ కు కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. తనను కాదని కాలుదువ్వి వెళ్ళిన రాజు గెలిస్తే తన పరువు గోదారిలో కలవడం కాయం.ఈ ఎఫెక్ట్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా కనబడుతుంది. మొత్తంమీద రఘురామ కృష్ణంరాజు జగన్ కు పెద్ద పరీక్ష పెట్టారనే చెప్పాలి.ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇక జగన్ కు వచ్చే ఎన్నికల్లో తిరుగులేనట్లే.