Father Rape Daughter : కన్నకూతురిపైనే కన్నేసిన తండ్రి.. రెండుసార్లు నోరు నొక్కి మరీ..!

Updated on: January 23, 2022

Father Rape Daughter : కన్నకూతురిని కంటికిరెప్పలా కాపాడాల్సిన తండ్రే.. ఆమెపాలిట శాపమయ్యాడు. తండ్రి తన పట్ల అంత అమానుషంగా ప్రవర్తించడం ఏ మాత్రం ఊహించని కూతురు.. తండ్రి వికృత రూపాన్ని చూసి విస్తుపోయింది. కూతురి నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. మర్నాడు తన సోదరుడికి విషయం చెప్పగా.. అతను తల్లికి జరిగిందంతా వివరించారు. తల్లి బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో.. విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్ భార్యకు ఇటీవలే జబ్బుచేసింది. తన సోదరిని పరామర్శించేందుకు ఇంటికొచ్చిన సోదరుడు.. ఆమె పరిస్థితి చూసి తనతో పాటు ఊరికి తీసుకెళ్లాలనుకున్నాడు. తనతోపాటు పిల్లల్ని కూడా ఊరికి తీసుకెళ్తానని చెప్పగా.. భర్త పిల్లల్ని తనతోనే ఉంచుకుంటానన్నాడు. భర్త వికృత చేష్టలను పసిగట్టలేని తల్లి.. 15 ఏళ్ల కూతురు, ఇద్దరు కొడుకుల్ని భర్త వద్ద ఉంచి,తన సోదరుడితో కలిసి మహబూబ్ నగర్ కు వెళ్లింది. ఎప్పటిలాగానే జనవరి 9వ తేదీ రాత్రికి ఇంటికొచ్చిన తండ్రి.. కూతురిపై కన్నేశాడు.

ఆమె నోరునొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయాన్నే జరిగిన విషయాన్ని సోదరుడికి చెప్పుకుని బోరున విలపించింది ఆ బాలిక. అనంతరం మహబూబ్ నగర్ లో ఉన్న తల్లివద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించగా.. శుక్రవారం పిల్లలతో కలిసి హైదరాబాద్ కు చేరుకుంది. భర్తపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel