Today Horoscope : మేష రాశి వారికి కెరీర్ పరంగా ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. సామాజిక స్థాయిలో ప్రజల హృదయాలు గెలుచుకోగలరు. వృషభ రాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా గతంలో కొన్ని సమస్యలు వచ్చినట్లయితే ఈ రోజు వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. మిధున రాశి వారు ఈ రోజు కాస్త మౌనంగా ఉండటం ఉత్తమం. తెలియని వ్యక్తి సహాయంతో ధనలాభం లభిస్తుంది. శివ చాలీసా పాటించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
కర్కాటక రాశి వారు వృత్తిపరంగా ఆఫీసులో పని తీరుతో సీనియర్లను ఆకట్టుకుంటారు.ఈరోజు కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిరుపేదలకు సహాయం చేయండి. సింహ రాశి వారు ప్రఖ్యాతులతో,గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రభుత్వ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రామ నామాన్ని జపించండి. కన్య రాశి గల విద్యార్థులు క్రీడలు,విద్యా రంగాల్లో విజయాన్ని పొందుతారు. ప్రేమ జీవితంలో ఈరోజు ఆప్యాయతలు పెరుగుతాయి. శ్రీకృష్ణున్ని పూజించండి. తులారాశి వారు మనసులోని అనవసరమైన ఆలోచనలు తొలగించడానికి ప్రాణాయామం చేయాలి. ప్రభుత్వ ఆంక్షల వల్ల ఏదైనా పని నిలిచిపోతే ఈరోజు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి,ఇల్లు కొనాలనే ఈ రాశి వారి కల ఈ రోజు నెరవేరుతుంది.
వృశ్చిక రాశి వారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నట్లైతే సహోద్యోగులకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవండి. వృశ్చిక రాశి వారు ఉత్సాహంగా ఉండటం ద్వారా ఒక హృదయాన్ని గాయపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక పట్టండి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందవచ్చు. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మకర రాశి వారు ఈరోజు అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ రాశికి చెందిన కొందరికి ఈ రోజు తల నొప్పి సమస్య రావచ్చు.
జీవిత భాగస్వామి మీకు అన్ని రంగాలలో సహకరిస్తారు.శని స్తోత్రాన్ని పఠించండి. కుంభ రాశి వారికి వృత్తిపరంగా పేరు పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటే ఈరోజు మీకు ఉత్తమమైన రోజు అవుతుంది. మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.గతంలో నిలిచిపోయిన పనులు ఈరోజు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఉపాధి కోసం వెతుకుతున్న వారి కల కూడా ఈ రోజు నెరవేరుతుంది.
Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…