...

సైనా నెహ్వాల్ ని క్షమాపణ కోరిన హీరో సిద్ధార్థ్..!

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటన పై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్..సైనాపై చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి,సింగర్ చిన్మయి,సైనా తండ్రి,సైనా నెహ్వాల్ భర్త,బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.తమ నిరసనను వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement

సిద్ధార్థ తాను చేసిన ట్వీట్ ద్వారా ఎవ్వరిని అగౌరవపరచలేదంటూ వివరించే ప్రయత్నం చేశారు. తాజాగా సిద్ధార్థ్ ట్విట్టర్ లో తాను పెట్టిన కామెంట్స్ పై మళ్లీ స్పందించారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సైనా నెహ్వాల్ పెట్టిన ట్వీట్ మీద తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చారు.

Advertisement

అయితే తాను పెట్టిన కామెంట్స్ చాలామందిని బాధించిందని అన్నారు. కానీ నేను మహిళలను కించపరుస్తూ కామెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ట్విట్ చేయలేదంటూ వివరణ ఇచ్చారు. సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని..తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్ట్ చాలా మందిని బాధ పెట్టిందని..కనుక అలాంటి కామెంట్స్ చేసినందుకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు నటుడు సిద్ధార్థ్.

Advertisement
Advertisement