September 21, 2024

ఫిబ్రవరిపై ఆశలు పెట్టుకున్న మెగా హీరోలు..!

1 min read
CHir

జనవరి కథ దాదాపుగా ముగిసినట్టే. ఇక ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం ఫిబ్రవరి సినిమాల పై పడింది. మొదటి వారంలో ఆచార్య, చివరి వారంలో భీమ్లా నాయక్ రెండూ పాన్ ఇండియా మార్కెట్ తో ప్రమేయం లేనివే కనుక వాయిదా పడే ఛాన్స్ అయితే లేదు. అందుకే సైలెంట్ గా ప్రమోషన్స్ కూడా షురూ చేయబోతున్నారా? థర్డ్ వేవ్ ముంచుకు రాకముందే ఇండస్ట్రీలో ఆఖరి ఆట గా వచ్చి భలే సక్సెస్ కొట్టారు నాచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్ సరే. ఆ తర్వాత రావాల్సిన పెద్ద సినిమాలన్నింటిని భూతం లా బయటపెట్టేసింది ఓమిక్రాన్ మహమ్మారి. ఆ విధంగా బిగ్ టికెట్ మూవీ లేకుండానే  చప్పగా గడిచిపోతోంది జనవరి నెల. మరి ఫిబ్రవరి నెల అయినా బేఫికర్ అంటుందా? బడా మేకర్స్ కి భరోసానిస్తుందా?

CHir

అంత భయానకమేమి కాదనే ఎట్మాస్ఫియర్ జనంలో బాగా పెరిగిపోతోంది. అటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డేట్ ఫిక్స్ అవ్వడంతో మరో రెండు నెలల పాటు లాక్ డౌన్ అంటూ విధించే పరిస్థితి లేదని హింట్ రానే వచ్చేసింది. మహా అయితే తియేటర్ ఆక్యుపెన్సీని 50% కి కుదిస్తారు తప్పితే,మొత్తానికే మూత పడవు అన్న గ్యారెంటీ అయితే ఉంది. అందుకే యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఫిబ్రవరి సినిమాలు. ఫిబ్రవరి మొదటి వారాన్ని ముందే లాక్ చేసుకుని ఇంటలిజెంట్ అనిపించుకుంది మెగా మూవీ ఆచార్య. ఆవిధంగా నెలన్నర గ్యాప్ తర్వాత రాబోయే పెద్ద సినిమా ఇదే కాబోతోంది.

 

ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేసి మ్యూజికల్లీ పాపులారిటీ తెచ్చుకున్నారు ఆచార్య మేకర్స్. సంక్రాంతి తర్వాత దూకుడు పెంచి మెగా హీరోలిద్దరు ప్రమోషన్స్ తో దుమ్ము రేపాలని డిసైడ్ అయ్యారట. మిడిల్ ఆఫ్ ఫిబ్రవరిని నమ్ముకున్న మేజర్ కిలాడీ లాంటి సినిమాల్ని అటుంచితే,లాస్ట్ వీక్ పై కన్నేసిన భీమ్లా నాయక్ పైనే ఫోకస్ ఎక్కువగా ఉంది. సంక్రాంతికే రావాల్సిన భీమ్లా RRR కోసం త్యాగం చేసి పక్కకు తప్పుకుంది. ఈసారయితే ఏ సినిమాకి చోటివ్వకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఫిదా చేసే పనిలో ఉంది సితార ఎంటర్ టైన్మెంట్స్. సో ఫిబ్రవరి నెలంతా మెగా హీరోల మ్యాజిక్ తో మజా మజాగా మారబోతోందన్న టాక్ వినిపిస్తోంది.