...

RGV Comments : ప్రైవేట్ ప్రాపర్టీపై ప్రభుత్వానికి రైట్ ఉంటుందా.. ఏపీ సర్కారుపై ఆర్జీవీ సెటైర్స్..

RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్స్ ధరలపై వివాదం ఇంకా ముదురుతోంది. ఏపీ సర్కారు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్లు సీన్ ఉండటం గత కొద్ది రోజుల నుంచి సాగుతోంది. ఇటీవల హీరో నాని సినిమా టికెట్ల ధరల పెంచడాన్ని నిరసిస్తూ కిరాణా వ్యాపారమే బెటర్ అంటూ వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు మంత్రి అనిల్, బొత్స సత్యానారాయణ, పేర్ని నాని, నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. తనదైన శైలిలో ఏపీ సర్కారుపై ఆర్జీవీ సెటర్స్ వేశాడు.

Advertisement

ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తూ భూములను పరిశ్రమల కోసం కేటాయిస్తుందని, తద్వారా ఉద్యోగితను పెంచే కార్యక్రమాలను చేపడుతుందని అభిప్రాయపడ్డారు. అటువంటి ప్రభుత్వం థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ ఫిక్స్ చేయడంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

Advertisement

థియేటర్స్‌లో టికెట్స్ ప్రైస్ నిర్ణయించడం వెనుకున్న లాజిక్ తనకు అర్థం కావడం లేదని చెప్పాడు.
ఒకడు హోటల్ పెట్టి అందులోని ఇడ్లీకి రూ. పది లేదా వంద లేదా రూ.1,000 అని రేటు నిర్ణయిస్తాడని, ఇష్టమున్న వారు కొంటారని, లేని వారు వదిలేస్తారని అన్నాడు. ఈ సమయంలో గవర్నమెంట్ వచ్చి రేటు నిర్ణయిస్తే ఎలా ఉంటుందో తనకు అర్థం కావడం లేదని వర్మ తెలిపాడు.

Advertisement

బట్టల కొట్టులో షర్ట్ రూ.500 ఉండొచ్చు లేదా రూ.5,000 ఉండొచ్చు. అయితే, అందరూ రూ.500 పెట్టి షర్ట్ లేదా ఇతర బట్టలు కొనరు ఎవరికి నచ్చితే వారు మాత్రమే డబ్బులు వెచ్చించి మరీ కొంటుంటారు. అలా ఎవరి స్థోమతను బట్టి వారు బట్టలు కొంటారని వర్మ వివరించాడు. థియేటర్స్ నిర్మాణానికి ప్రభుత్వం రుణం ఇవ్వని పక్షంలో అందులోని రేట్స్ ఎలా డిసైడ్ చేయగలదని వర్మ ప్రశ్నించాడు.

Advertisement

ప్రైవేట్ ప్రాపర్టీపై ప్రభుత్వానికి రైట్ ఎలా ఉంటుందని అడిగాడు. మొత్తంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఈ టికెట్స్ వ్యవహారంలో తల దూర్చడమే కాదు.. తనదైన శైలిలో వాదనలు వినిపించాడు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన సెటైర్స్ కూడా వేశాడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపైన ఏపీ మంత్రులు కాని వైసీపీ నేతలు కాని ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Advertisement

Read Also : Samantha : ఆ హీరోను ఇక ఎప్పుడూ నమ్ముతా.. సమంత సెన్సేషనల్ పోస్ట్..

Advertisement
Advertisement