Chandrababu : వైసీపీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఎవరి పేర్లను ప్రత్యేకంగా ఆమె తీయలేదు. కానీ తాను చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్పేశారు. నారా భువనేశ్వరి మాటలు ఎవరికి రీచ్ అవ్వాలో వారికి అయిపోయాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలే నారా భువనేశ్వరి ఆగ్రహానికి కారణమని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. వైసీపీ నేతల మాటల వలన నారా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడితే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయాల్లో లేరు. కనీసం పార్టీ మీటింగులకు కూడా హాజరవ్వరు. అలాంటి సాధారణ గృహిణిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు ధూషించారు. పరుష పదజాలాన్ని వాడారు. ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అని ఆలోచించకుండా వైసీపీ నేతలు అంతటి దుస్సహాసానికి ఎలా పాల్పడుతారంటూ ఒక వర్గం వారు, తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. అన్యాయంగా తన భార్యను ధూషించారని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఒక్కసారిగా ఏపీలో ఆగ్రహాజ్వాలలు రేగిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబం మొత్తం నారా ఫ్యామిలీకి అండగా నిలిచారు. నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అంతా స్పందించారు.
తాజాగా రాయలసీమ ప్రాంతంలో వచ్చిన వరదలకు చనిపోయిన 48 కుటుంబాలకు నారా భువనేశ్వరి ఎన్టీయార్ ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందిచారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ.. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, అనవసరంగా నోరు పారేసుకోవద్దన్నారు. ఎవరి క్షమాపణలు తనకు అక్కరలేదని, ఎవరి పాపన వాళ్లే పోతారంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.
Read Also : Liver In Danger : మీ కాలేయాన్ని ఇలా శుద్ధి చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world