Liver in Danger : మానవ శరీరంలో ఒక్కో అవయవం దాని విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తుంది. అయితే, మనిషి తన జీవితకాలంలో డబ్బులు, ఆనందం, ఏంజాయ్ మెంట్ కోసం ఆరోగ్యాన్ని, శరీరాన్ని సరిగా పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుత తరుణంలో బయట ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే బయట దొరికే చిరుతిండ్లు, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉన్నాయా? తాజా ఆయిల్‌తో చేస్తు్న్నారా? వాడేసినా, మురికి పదార్థాలతో చేస్తున్నారా? అని కనుక్కోవడం చాలా కష్టం. అలాంటివి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరంలోని అవయవాలపై కూడా అది తీవ్ర ప్రభావం చూపించవచ్చు. మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులతో ప్రతీ ఒక్క అవయవం ప్రధానమైనది. ప్రతీ అవయవం దాని డ్యూటీ చేయడం వల్లే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
కాలేయం విషయానికొస్తే మనిషి శరీరం మొత్తానికి సరఫరా అయ్యే రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే రక్తం ఫ్యూరిఫై కాదు. దీంతో గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే ప్రతీ ఒక్కరు కాలేయంపై ప్రభావం పడకుండా చూసుకోవాలి. కొందరు అతిగా మద్యపానం చేస్తుంటారు. దీనవలన కాలేయం పాడవుతుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. మన తీసుకునే ఆహారం వలన కొంత మేర బ్యాక్టీరియా వంటివి కాలేయం పైన తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అందుకోసం ఈ రెమిడీ వాడితే కాలేయాన్ని శుభ్రంగా ఉండటంతో పాటు యాక్టివ్‌గా పనిచేస్తుంది.
పూదీన (mint) ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనిని మెడిసిన్స్‌లో కూడా వాడుతుంటారు. శీరీర, జుట్టు సౌందర్య ఉత్పత్తుల్లో కూడా దీనిని వాడుతుంటారు. పూదీనను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటీబాడీస్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పూదీన ఆకులు 10 నీటిలో వేసి సన్నని మంట మీద మరిగించాలి. ఆకులు లైట్ పసుపు రంగులోకి వచ్చేవరకు మరిగించుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. వారంలో మూడు సార్లు పూదీన జ్యూస్ తాగితే కాలేయం శుభ్రం అవుతుంది. ఎంతో యాక్టివ్ గా పనిచేస్తుంది. పొద్దున లేదా రాత్రి పడుకునే ముందు కూడా తాగొచ్చు. పరిగడుపున తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Read Also : Radhe Shyam Theatrical Trailer : రాధే శ్యామ్ ప్రీ-రీలీజ్ ఈవెంట్.. ట్రైలర్ వచ్చేసింది..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world