RGV Comments : ఈ టీవీలో రచ్చ చేసిన ఆర్జీవీ.. వాళ్ళందర్నీ పెళ్లి చేసుకుంటాడట!

RGV Comments : రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అటువంటి వర్మను ఓ టీవీ షో కోసం ఓ చానల్ వారు స్పెషల్ గెస్టుగా తీసుకొచ్చారు. ఇక వర్మ ఊరుకుంటాడా. తన ప్రతాపాన్ని చూపెట్టాడు. కైపెక్కించే చూపులతో అలనాటి హీరోయిన్ ఇంద్రజను చూస్తూ ఒక్క సారిగా అందరిలో హీటును పెంచేశాడు. తన మార్కు చూపులతో అందరినీ అలరించాడు.

ఓ ప్రముఖ చానల్ వారు డిసెంబర్ 31 ని పురస్కరించుకుని పెళ్లాం వద్దు.. పార్టీయే ముద్దు అనే ప్రోగ్రాంను ప్లాన్ చేశారు. ఇందుకోసం వివాదాలతో ఎల్లప్పుడూ సహజీవనం చేసే రామ్ గోపాల్ వర్మను స్పెషల్ గెస్టుగా ఆహ్వానించారు. అంతే కాకుండా హాట్ యాంకర్ రష్మితో పాటు అలనాటి హీరోయిన్ ఇంద్రజ, మాజీ యాంకర్ లాస్య, జబర్దస్త్, ఢీ కంటెస్టెంట్లతో రచ్చ చేయించారు. అంతా బానే ఉన్నా రామ్ గోపాల్ వర్మ ఇక్కడ కూడా తన దైన శైలిలో వ్యవహరించాడు. స్టేజి మీద ఉన్న అందరు లేడీస్ తో నేను మీ అందరినీ ఒకేసారి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను అంటూ బాంబు పేల్చాడు.

ఆ తర్వాత స్టేజి మీదకు ఎక్కి మాజీ నటి ఇంద్రజను కసిగా చూస్తూ రచ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ చానల్ విడుదల చేసింది. ప్రోమోలోనే ఇంతలా రచ్చ చేసిన ఆర్జీవీ ఇక ప్రోగ్రాంలో ఎంతలా రచ్చ, రచ్చ చేస్తాడో అని అభిమానులు చర్చించు కుంటున్నారు. ఈ ప్రోగ్రాంను డిసెంబర్ 31 సందర్భంగా స్పెషల్ గా టెలీ కాస్ట్ చేసేందుకు ఆ టీవీ యాజమాన్యం యోచిస్తోంది. వర్మ చేసిన రచ్చను చూసేందుకు మనం ఇంకా కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాలి.

Advertisement

Read Also : Ashu Reddy Comments RGV : సెక్స్ విషయంలో అషురెడ్డి బోల్డ్ కామెంట్స్.. అందుకే ఆర్జీవీ ఇష్టమట..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel