Corriander Benefits : ధనియాలతో డయాబెటిస్‌కు చెక్.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఇలా నియంత్రణ..!

coriander-benefits-coriander-can-control-blood-sugar-levels-in-telugu
coriander-benefits-coriander-can-control-blood-sugar-levels-in-telugu

Corriander Benefits : దాదాపుగా ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే వంటింటి దినుసు ధనియాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనియాలు మనిషికి ఎంతో ఉపయోగకరమైనవని పెద్దలు చెప్తుంటారు. వంటింటి దివ్య ఔషధంగా భావించబడే ఈ ధనియాలతో కొత్తిమీర వస్తుంది. కోతిమీరను కూరలో వేయడం ద్వారా చక్కటి రుచి వస్తుంది. ఇక ధనియాలను మసాలా రూపంలో వాడితే ఇక టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది.

coriander-benefits-coriander-can-control-blood-sugar-levels-in-telugu
coriander-benefits-coriander-can-control-blood-sugar-levels-in-telugu

ధనియాలతో మానవుడి ఆరోగ్యానికి బోలెడు ప్రయెజనాలున్నాయని ఇటీవలి అధ్యయనాలలో తేలింది. ధనియాలు హ్యూమన్ బాడీ హీట్‌ను కంట్రోల్ చేయడంతో పాటు గ్యాస్ ఎఫెక్ట్స్‌ను తగ్గిస్తాయి. మానవుడి శరీరంలోని అంతర్గత అవయవాలలోని పెయిన్స్ తగ్గించి, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌నూ కంట్రోల్ చేస్తాయి. ధనియాల పొడిని వాటర్‌లో కలిపి ప్రతీ రోజు ఉదయం తీసుకుంటే చక్కటి ఉపయోగాలుంటాయి. ధనియాలను కషాయంగా తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. ధనియాలను కషాయంగా మార్చుకుని తాగడం వలన హ్యూమన్ బాడీలో హీట్ కంట్రోల్‌లోకి వస్తుంది. జలుబు, దగ్గు తగ్గుతుంది.

Advertisement

ధనియాలను తీసుకోవడం వలన హ్యూమన్ బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లోకి వస్తాయి. ప్రతీ రోజు ధనియాల కషాయం తాగడం వలన డయాబెటిస్ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. టైఫాయిడ్ రాకుండా ధనియాలలోని పోషకాలు పోరాడుతాయి. టైపాయిడ్‌కు కారణమయ్యే సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాలలో పుష్కలంగా ఉంటాయి. ధనియాల కషాయాన్ని ప్రతీ రోజు రెగ్యులర్‌గా తీసుకుంటే బ్లడ్‌లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది.

హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకూ ధనియాల కషాయం సాయపడుతుంది. ధనియాల కషాయంలో పాలు, బెల్లం కలుపుకుని తాగినట్లయితే మంచి నిద్ర కూడా వస్తుంది. నిద్రలేమి సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. పసుపులోనూ ధనియాల పొడి కలుపుకుని మొటిమలు ఉన్న చోట అప్లై చేసుకుంటే మొటిమలూ తగ్గిపోతాయి.

Advertisement

Read Also : Diabetics : మధుమేహులు పండ్లు, స్వీట్లు, అన్నీ తినొచ్చు కానీ..!

Advertisement