Janaki Kalaganaledu serial Oct 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర అలాగే చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో జానకి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర షాప్ కి వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు అదంతా చూస్తున్న మల్లిక ఎలా అయినా జానకిని చదువుకోకుండా డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి చదువుకుంటూ ఉండగా కావాలనే పదేపదే జానకి అని పిలుస్తూ ఉంటుంది.
అప్పుడు కావాలని కాల్ బినికింది అని నాటకం ఆడుతూ ఉండగా పనిమనిషి చికిత అది పసిగట్టి అమ్మ మీరు మల్లికమ్మ మాటలు నమ్మొద్దు అని కావాలని మీ చదువును చెడగొట్టాలని అలా నాటకాలు వాడుతోంది అనడంతో జానకి సరే అని అనుకుంటుంది. అప్పుడు జానకి అక్కడికి సూదిని తీసుకుని రావడంతో అది చూసి మల్లిక షాక్ అవుతుంది.
అది చూసి పనిమనిషి చికిత నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి ఆ సూధితో మల్లికా కాలు కూర్చోబోతు ఉండగా అప్పుడు మల్లిక నా కాలు నయం అయిపోయింది అని అనటంతో వెంటనే జానకి,మల్లిక పై సీరియస్ అవుతుంది. అప్పుడు నువ్వు వచ్చింది జానకి అనే సన్నగా తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది మల్లిక.
జానకి కలగనలేదు సీరియల్ అక్టోబర్ 12 ఈరోజు ఎపిసోడ్ : జానకి నానా మాటలు అన్న అఖిల్..
జానకి విషయంలో ఏదో ఒక ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అఖిల్ ఫుల్ గా తప్పదగి ఊగుతూ ఇంటికి వస్తాడు. అది చూసిన మల్లిక అందర్నీ పిలిచి గోల గల చేసి అఖిల్ తప్పతాగి ఇంటికి వచ్చాడు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు అఖిల్ కింద పడిపోతూ ఉండగా జెస్సి వెళ్లి పట్టుకుంటుంది.
అప్పుడు జ్ఞానాంబ అఖిల్ తాగి వచ్చావా అని అనటంతో లేదు అంటూ అబద్ధం చెబుతూ ఉంటాడు అఖిల్. అప్పుడు జ్ఞానాంబ,అఖిల్ చంప చల్లుమనిపిస్తుంది. అప్పుడు జెస్సి,అఖిల్ లోపలికి పిలుచుకొని వెళ్లగ జ్ఞానాంబ అఖిల్ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు జెస్సి,అఖిల్ కీ స్నానం చేసి తల తుడుస్తూ ఉంటుంది. అఖిల్ జెస్సిని అపార్థం చేసుకుంటూ జెస్సీని తిడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మల్లిక, జానకి వస్తారు.
అప్పుడు జానకి ఎందుకు అఖిల్ ఇలా ప్రవర్తిస్తున్నావు తప్పుల మీద తప్పులు చేసి అత్తయ్య గారి దృష్టిలో నువ్వు ఇంకా చెడ్డ అవుతున్నావు అని అంటూ ఉండగా అప్పుడు మల్లిక మధ్యలో జోక్యం చేసుకొని అఖిల్ జానకి చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు అఖిల్ వదిన అదేదో సామెత ఉంది కదా అంటూ పెద్ద వదిన తాను చేసిన తప్పులు అన్నీ మర్చిపోయి అమ్మను అన్న మాటలు అన్నీ మర్చిపోయేలా చేయాలి అని నేనేదో పెద్ద తప్పులు చేసినట్టు నన్ను దోషిగా నిలబెడుతుంది అంటూ జానకి గురించి తప్పుగా మాట్లాడుతాడు అఖిల్.
అప్పుడు మల్లికా అఖిల్ నీకు కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో నేనేం తప్పుగా మాట్లాడలేదు వదిన పెద్ద వదిన చేసినవే నేను చెబుతున్నాను అని అంటాడు. అప్పుడు అఖిల్,జానకి ఐపీఎస్ కల గురించి మాట్లాడుతాడు. అప్పుడు జానకిని దోషిని చేసి మాట్లాడుతూ ఉంటాడు అఖిల్. అప్పుడు అఖిల్ జానకి గురించి నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉండడంతో జెస్సి ఎమోషనల్ అవుతూ ఉండగా మల్లిక సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు జానకి ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మల్లికా సంతోషపడుతూ ఆనందంగా ఉంటుంది.
Read Also : Janaki Kalaganaledu: జెస్సి పై కోప్పడిన అఖిల్.. సరికొత్త ప్లాన్ వేసిన మల్లిక..?