TDP Favour districts : ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత కూడా టీడీపీ ఏ మాత్రం బలపడకుండా.. తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రజలకు పథకాలు ఒకటి ఇస్తున్నారు. అంతే ప్రజలకు సంబంధించి మిగతా పనులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు. కనీ టీడీపీని దెబ్బ తీయడానికి మాత్రం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి టీడీపీది అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
అయితే వైసీపీ అనుకున్న విధంగా టీడీపీది దెబ్బతీయగలిగారా…. 2019 ఎన్నికల కంటే టీడీపీ పరిస్థితి దిగజారిందా అంటే ఇంకా మెరుగుపడిందే తప్ప.. దిగజారిపోలేదని చెప్పొచ్చు. వైసీపీ చేస్తున్న కొన్ని పనులే టీడీపీ బలపడాటానికి కారణం అయ్యాయి.
అయితే మొత్తం ఐదు జిల్లాల్లో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది. ఉమ్మడి జిల్లాల ప్రకారం చూసుకుంటే అనంతపురం, ప్రకాశం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి ఊహించని విధంగా బలం పెరుగుతుందని వైసీపీ అంతర్గత సర్వేల్లో తేలిందట. మరి రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఏది గెలవనుందో చూడాలి.
Read Also : AP Politics : కేంద్రం ఫోకస్‌ను తమ వైపు తిప్పుకుంటున్న ఏపీ ఎంపీలు.. ఏకంగా ఏం చేశారంటే..?