Chandrababu Naidu : పార్టీ లైన్ క్రాస్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. వారిపై చర్యలు?

Updated on: August 4, 2025

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరు చేస్తున్నదని చెప్పొచ్చు. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షలతో మొదలు పెట్టి బంద్‌లకు పిలుపునిస్తూ ధర్నాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలోనే పోరాటం చేస్తున్నారు చంద్రబాబు.

ఈ సందర్భంలో చంద్రబాబుకు అండగా నిలవాల్సిన కేడర్, నేతలు ఆయన్ను పట్టించుకోవడం లేదని టాక్ వినబడుతోంది. పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారనే డిస్కషన్ టీడీపీ వర్గాల్లోనే జరుగుతున్నది. బాబును అనుసరించాల్సిన తెలుగు తమ్ముళ్లు అది పక్కనబెట్టి నిరసనలో తమ బలాబలాలను ప్రదర్శిస్తున్నారన్న వాదన తెరమీదకు వస్తున్నది. ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాల్లో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చాలా మంది నేతలు బల ప్రదర్శనకు దిగారు. ప్రత్యేకంగా వారి పేర్లతోనే బ్యానర్స్ రాయించుకున్నారు.

అధినేత ఫొటోను పక్కనబెట్టి తమ ఫొటోలనే పెద్దగా వేయించుకున్నారు. మందీ మార్బలాన్ని రంగంలోకి దింపి తమ సత్తా చూపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధినేతకు వాల్యూ ఇవ్వకుండా తమ సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విలేకరులను సైతం తమ పేర్లు వచ్చేలా చూడాలంటూ కోరుతున్నారట కొందరు టీడీపీ నేతలు. అధినేత నాయకత్వానికి బదులు తమ నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్స్ కూడా ఇచ్చారట. మొత్తంగా పార్టీ అధినేత చెప్పిన లైన్‌కు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించారట.

Advertisement

ఇప్పట్లో ఎన్నికలనేవి లేవు. ఈ నేపథ్యంలో ఇటువంటి విచిత్ర పనులు చేయడానికి గల కారణాలేంటి..అసలెందుకు ఇలా చేశారనే విషయాలపై టీడీపీ నాయకులు కొందరు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా , ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి వెళ్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.. అయితే, కొందరు మాత్రం అలా బిహేవ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also : CM KCR : కేంద్రంతో సమరానికి సై.. మొన్న స్టాలిన్.. నేడు కేసీఆర్..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel