Intinti Gruhalakshmi Sept 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు తులసి కి యాక్సిడెంట్ అయినట్లు కలగంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో లాస్య ఏంటి ఆ తులసి పేరు కలవరిస్తున్నావా అని అంటుంది. అప్పుడు నందు లేదు అని చెప్పడంతో తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాస్య అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత నందు నిజంగానే తులసికి యాక్సిడెంట్ అవుతుందా ఒకసారి సామ్రాట్ కి ఫోన్ చేద్దామా అని వెంటనే అభి కి ఫోన్ చేసి తులసి గురించి అడుగుతాడు.
అప్పుడు తులసి గేటు దగ్గర ఎదురుచూస్తుంది అని అభి చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు నందు. మరొకవైపు తులసి సామ్రాట్ కి ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడగగా ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటాడు సామ్రాట్. వెంటనే తులసి కంగారు పడకండి జాగ్రత్తగా రండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెబుతుంది.
అప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా యాక్సిడెంట్లు అయినా జరగవచ్చు అని అనగా సామ్రాట్ నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదు అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతాడు. ఇంతలోనే హనీ అక్కడికి వచ్చి ఎప్పుడు తాత ఏ స్కూల్ కి తీసుకొని వెళుతున్నాడు ఈరోజు నువ్వు తీసుకుని వెళ్ళు డాడీ అని అంటుంది.
అప్పుడు సామ్రాట్ బిజీగా ఉన్నాను అని చెప్పగా వెంటనే తులసి ఏం పర్లేదు దింపి రండి అని చెబుతుంది. తర్వాత హనీ సామ్రాట్ ఇద్దరూ కార్లో వెళ్తూ ఉండగా అప్పుడు హనీ కార్ స్పీడ్ గా తోలమని చెప్పడంతో సామ్రాట్ ఇంకా స్పీడ్ గా తోలుతాడు. అప్పుడు కార్లు బ్రేకులు ఫెయిల్ అయ్యి సామ్రాట్ కారు వెళ్ళి చెట్టు కు గుద్దుకుంటుంది.
Intinti Gruhalakshmi Sept 19 Today Episode : హనీని చూసి సామ్రాట్ ఎమోషనల్..
ఇంతలోనే తులసికి ఫోన్ చేసి సామ్రాట్ వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్లు చెబుతారు. వార్త విన్న తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ వార్త నందు వాళ్లు కూడా చెప్పడంతో నందు సామ్రాట్ తో అటు హనీ ఉందా అని అనుకుంటాడు. ఆ తర్వాత హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు తులసి కంగారుగా ఏమి జరగలేదు కదా డాక్టర్ అని అడగగా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి ఇప్పుడు మత్తులో అని చెబుతుంది.
ఇంతలోనే సామ్రాట్ కీ మెలుకువ వచ్చి హనీకి ఎలా ఉంది బాగానే ఉందా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు తులసి ఏం కాలేదు పక్కనే ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటుందీ అని ధైర్యం చెబుతుంది తులసి. సామ్రాట్ ఏడుస్తూ పాపం చిన్నపిల్ల అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నందు తాగిన మత్తులో చేసిన దానికి ఇంత దారుణానికి దారితీస్తుంది అనుకోలేదు నన్ను క్షమించి హనీ ని కాపాడు దేవుడా అని మనసులో కోరుకుంటూ ఉంటాడు.
ఇప్పుడు తులసి,లాస్య ఇద్దరు సామ్రాట్ ని ఓదారుస్తూ ఉంటారు. తెలవని డాక్టర్ వచ్చి హనీ బాగానే ఉంది రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాను ఇప్పుడు మీరు వెళ్లి చూడవచ్చు అనడంతో సామ్రాట్ హనీ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు.
Read Also : Intinti Gruhalakshmi Sept 17 Today Episode : హనీ సామ్రాట్‌లకు కార్ యాక్సిడెంట్.. షాక్‌లో తులసి..?