Pawan Kalyan: శత్రువు మిత్రుడు కావచ్చు అన్నట్లుగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో రాణించాలంటే నేతకు కావాల్సింది మాట ఒక పవర్. అందుకే చాలా మంది నేతలు ఆచీతూచీ మాట్లాతారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఆవేశం ఎక్కవ. ఇలా మాట్లాడడంతో ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏపీలో జనసేన పార్టీని నంబర్ వన్‌గా నిలుపాలని, తాను సొంతగా ఎదగాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇలాంటి ఆలోచనలో ఉన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ సభలో పవన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు లో మాత్రం పవన్ మా వాడు ఏప్పటికైనా మాతో కలిసి పని చేస్తారని చెబుతున్నారు. కానీ వైజాగ్ సభలో పవన్ మాత్రం వైసీపీ, టీడీపీల మధ్య మాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని కామెంట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
వైజాగ్‌కు చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించాడు. పవన్ కామెంట్స్ చూస్తే త్వరలో వైసీపీతో జత కడుతున్నట్టు తెలుస్తోందని కామెంట్ చేశాడు. టీడీపీ మాత్రమే వైసీపీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని చెప్పారు. తమకు వైసీపీతో మాచ్ ఫీక్సింగ్ చేసుకోవాల్సిన గతి లేదని మండిపడ్డారు. పవన్ కామెంట్స్ చూస్తే తానే వైసీపీకి పరోక్షంగా స్నేహ హస్తం అందిస్తున్నట్టు తెలుస్తోందని అభిప్రాయడ్డారు.
పవన్ చేసిన కామెంట్స్ టీడీపీని మారింత దూరం చేసేలా ఉన్నాయి. పవన్ టీడీపీ, వైసీపీల మీద వ్యూహాత్మకంగా కామెంట్స్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏలాగైనా ఏపీలో జనసేనా ఫస్ట్ స్థానంలో నిలిపాలని పవన్ కళ్యాణ్ ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Harish Rao : బై పోల్ ఓటమికి కారణం వాళ్లేనట.. మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world