Vastu Tips: ప్రస్తుత కాలంలో అందరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజుల్లో డబ్బు ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కూడా డబ్బులు చేతికి వచ్చినట్లే వచ్చి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ మనశ్శాంతి లేకుండా ఉంటారు. అయితే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి చాలామంది జ్యోతిష్యులను సంప్రదించి అనేక రకాల పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు వ్రతాలు చేసినా కూడా ఫలితం లేనప్పుడు ఏ దేవుడిని ప్రార్థించాలి ఎలా పూజలు చేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం
ఎంత కష్టపడి పని చేసినా కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతుంటే లక్ష్మీనారాయణలను పూజించాలి. అది కూడా కనకధారా స్తోత్రం జపిస్తూ భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణలకు పూజ ఆచరించాలి. ఇలా కనకధారా స్తోత్రం పఠిస్తూ లక్ష్మీనారాయణలకు పూజ చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా , భార్యాభర్తల మధ్య సానుకూలత కూడా ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో ఆయురారోగ్యాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం మాయమైపోతుంది.
Vastu Tips:
ప్రతిరోజు కనకధారా స్తోత్రం పఠిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఆ అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకుంటూ అమ్మ నీకు బంగారు వర్షాన్ని బిక్షంగా సమర్పించుకుంటున్నాను అంటూ అమ్మవారిపై బంగారు వర్షాలు కురిపించిన భావన మన మనసులో కలిగితే మనకు సంపదకు ఆరోగ్యానికి లోటు ఉండదు. అంతే కాకుండా ఆయుర్దాయానికి కూడ లోటు ఉండదు. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు కనకధారా స్తోత్రం పటిస్తూ అమ్మవారి రూపాన్ని మన మనసులో తలుచుకొని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.