...

Puneeth Rajkumar Death : పునీత్ డెత్‌కు కారణం అదేనా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే…

Puneeth Rajkumar Death : చాలా మంది సెలబెటీస్ చాలా తక్కువ వయస్సులోనే మృతి చెందారు. కన్నడ సినీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండుపోటుతో మరణించడం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు అనేక భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కేవలం నటనకే పరిమితం కాదు. మంచి సింగర్ కూడా. ఇప్పటికే ఆయన చాలా పాటలు పాడారు. వాస్తవానికి పునీత్ రాజ్‌కుమార్ చెన్నైలో పుట్టారు.

Advertisement

ఆయన చిన్నతనంలోనే వారి ఫ్యామిలీ కర్ణాటకలో సెటిల్ అయ్యారు. దీంతో అందరూ ఆయనను కర్ణాటకకు చెందిన వారనే అనుకుంటారు. అక్కడే పెద్దయిన రాజ్ కుమార్.. చైల్ట్ ఆర్టిస్ట్‌గా కన్నడ మూవీస్ లోకి ఎంట్రీ అయ్యారు. అనంతరం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని హీరోగా మారారు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన మూవీ ఇడియట్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని కన్నడలో అప్పుగా అనే పేరుతో రిమేక్ చేసి హిట్ అందుకున్నాడు పునీత్. అక్కడి నుంచి అంతకంతకూ క్రేజ్ పెంచుకుని సూపర్ స్టార్‌గా మారాడు.

Advertisement

వర్కవుట్స్ చేయడమంటే ఆయనకు చాలా ఇష్టమనే చెప్పాలి. ఇన్నేండ్ల కాలంలో వర్కవుట్స్ చేయని రోజే లేదంటే మనమే అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కువ వర్కవుట్స్ చేయడంతోనే ఆయన చనిపోయారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న ఏజ్‌కు అంతలా హెవీ వర్కవుట్స్ చేయడం మంచికాదని చెబుతున్నారు డాక్టర్స్. హెల్త్ పై ఎంతో కేర్ తీసుకునే పునీత్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని నుంచి ఆయన ఫ్యాన్స్ ఇంకా తెలుకోలేకపోతున్నారు. ఇక ఎప్పటిలాగే వర్కవుట్స్ కోసం వెళ్లిన రాజ్‌కుమార్ జిమ్‌లోనే హార్ట్ స్ట్రోక్‌తో పడిపోయారు. ఆ ముందు రోజు నైట్ టైంలో పునీత్‌కు హార్ట్‌లో పెయిన్ వచ్చినట్టు కొందరు చెబుతున్నారు.
Read More :  Instagram Silent War : బన్నీ వర్సెస్ విజయ దేవరకొండ.. ఇన్ స్టాలో సైలెంట్ వార్..

Advertisement
Advertisement