Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Punith Raj Kumar: బ్రేకింగ్ న్యూస్: కన్నడ పవర్‌స్టార్ ఇక లేరు

Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వచ్చినా, డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా ఆయన మరణవార్తకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుంది. పునీత్ రాజ్ కుమార్ ... Read more

By Vinod Kumar

Published on: October 29, 2021 2:39 PM

Updated on: October 31, 2021 9:59 PM

Punith Raj Kumar

---Advertisement---

Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వచ్చినా, డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా ఆయన మరణవార్తకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుంది.

పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పాలంటే.. ఆయన మంచి నటుడే కాదు గాయకుడు కూడా. అలాగే కొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ చిత్రం తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించింది. హీరోగా ఆయన ఇప్పటి వరకు 29 సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘జేమ్స్’, ‘ద్విత్వ’ అనే సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అందరూ ఆయనని అప్పూ అని ప్రేమగా పిలుస్తారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :