Marri Rajasekhar : వైఎస్సార్‌సీపీ పార్టీ చాలా మంది నాయకులకు రాజకీయంగా అవకాశం ఇచ్చింది. అందులో జూనియర్, సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక అక్కడ కాంగ్రెస్ పార్టీ నీళ్లలో నుంచి ఒడ్డుకు పడిన చేపపిల్లలా తయారైంది దాని పరిస్థితి. దీంతో చాలా మంది సీనియర్ లీడర్లు వైసీపీ, టీడీపీలోకి వలస వెళ్లారు. అయితే, కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మర్రి రాజశేఖర్‌ను నిజంగానే దురదృష్టం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది.
2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. ఆయనకు మంత్రి పదవి అనేది అందని ద్రాక్షలా మారింది. వస్తుందనకున్న మంత్రి పదవి రాకుండా పోయింది. కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందా? లేదా అనేది ప్రశార్థకంగా మారింది.
సామాజిక వర్గమే కారణమా..
మర్రి రాజశేఖర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తొలి నుంచి టీడీపీ అంటే పడదు. దీంతో వైఎస్ హయాంలో 2004లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరసగా 2 సార్లు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ మర్రి రాజశేఖర్ ను కాదని విడదల రజనీకి టికెట్ కేటాయించారు. ఆయనకు టికెట్ రాకపోయినా వైసీపీ విజయం కోసం పాటుపడ్డారు. అయితే, జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని, మంత్రి కూడా అవుతారని అంతా భావించారు. కానీ శాసన మండలి రద్దు కావడంతో పిల్లి సుభాశ్ లాంటి వారే తమ మంత్రి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఈయనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పోయింది.
పదవి మాత్రం పక్కా.. మంత్రి పదవి నో.. :
కాగా, జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, తప్పకుండా మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ, మంత్రి పదవి మాత్రం ఇవ్వరని తెలుస్తోంది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు జగన్ పార్టీ కంటే టీడీపీకే మేలు చేసింది. దీంతో ఆయనకు మంత్రిపదవి ఇవ్వకపోవచ్చని అంతా భావిస్తున్నారు.
Read Also : AP Politics : కేంద్రం ఫోకస్‌ను తమ వైపు తిప్పుకుంటున్న ఏపీ ఎంపీలు.. ఏకంగా ఏం చేశారంటే..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world