Tarun reentry: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఎస్ఎస్ఎంబీ28 అనే చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టు అవ్వడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టించ చక్కర్లు కొడ్తోంది. అదేంటో, అందులో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా త్రివిక్రమ్ శ్రినివాస్ తన సినిమాల్లో ముఖ్యమైన పాత్రల కోస సీనియర్ హీరోలు, హీరోయిన్లను తీసుకుంటూ ఉంటారు. కానీ తాజాగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎబీ28 చిత్రం కోసం హీరో తరుణ్ ని తీసుకోతున్నట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలతో కొంత కాలంగా ఇండస్ట్రీక దూరంగా ఉన్న తరుణ్.. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఈ సినిమాను 2023 ఏప్రిన్ 28వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర బృందం ముందే నిర్ణయించుకుంది. ఎందుకుంటే హీరో మహేష్ సినీ కెరియర్ లో ఏప్రిల్ 28వ తేదీ సెంటిమెంట్ డేట్. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు రిలీజ్ చేసిన చిత్రం బాక్సాఫీసును బద్ధలు కొట్టడమే కాకుండా ఆయన స్టార్ డమ్ ను విపరీతంగా పెంచింది.