Viral video: పాములు చూస్తేనే చాలా మంది గజగజా వణికిపోతుంటారు. కనిపించిందంటే చాలు పదడుగుల దూరం పరిగెడుతుంటారు. దగ్గర్లో ఇంకెవరైనా ఉన్నారంటే వారిని కూడా లాగేస్తుంటారు. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరికొన్ని మాత్రం విపరీతమైన భయాన్ని కల్గిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఏంటి, అందులో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మురళీ వాలే హౌస్లా అనే ఓ స్నేక్ క్యాచర్ ఓ పామును అడవిలో వదిలేందుకు వెళ్లాడు. అయితే 12 అడుగుల పొడువున్న ఆ కింగ్ కోబ్రాను వదిలి పెడుతుండగా… అతనిపైకే పడగ విప్పింది. కాటేసేందుకు మీదమీదకు వచ్చింది. అయితే విషయాన్ని ముందుగానే గుర్తించిన స్నేక్ క్యాచర్ ఎలాంటి బెరుకు, భయం లేకుండా దాన్ని కట్రోల్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశాడు.
ఈ వీడియో ఇప్పటి వరకు 76 లక్షలకు పైగా వ్యూస్ ని సంపాదించింది. వీడియో చాలా బాగుండడంతో నెటిజెన్లు లైకులు, కామెంట్లు, షేర్ లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఆలస్యం ఎందుకు మీరే ఓసారి ఈ వీడియో చూసేయండి.